| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షి టీం ఆద్వర్యంలో మహిళల రక్షణ అవగాహన కార్యక్రమం

షి టీం ఆద్వర్యంలో మహిళల రక్షణ అవగాహన కార్యక్రమం


అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు

విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా ముఖ్యం

మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ

డైలీ భారత్, సిద్దిపేట: శ్రీ చైతన్య హై స్కూల్ సిద్దిపేట విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి,షీటీమ్ విధుల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిద్దిపేట షీటీమ్ బృందం.విద్యార్థి దశలో సమయం వృధా చేయవద్దు, సమయం ఎంతో విలువైనది మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ అన్నారు.ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. మేడమ్ గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో  షీ టీమ్ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమ్మాయిలను ఎవరైనా అవహేళన చేసిన  మరియు ఏ విధమైన ఇబ్బందులకు గురిచేసిన వెంటనే లాంటి సమస్య ఉన్న  ఒక చిట్టి రాసి బాక్స్ లో వేయాలని సూచించారు. దానికి సీక్రెట్ కి  షీ టీమ్  బృందం వద్ద ఉంటుందని వారు వారానికి ఒకసారి వచ్చి కి ఓపెన్ చేసి అందులో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకుంటారని సూచించారు.

విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది,

మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత.చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది  సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు విద్యార్థి దశ చాలా కీలక  కష్టపడే తత్వం కష్టపడి చదువుకోవడం  చాలా ముఖ్యమని మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని  సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. మరియు నూతన చట్టాల గురించి నూతన చట్టాలలో మహిళల రక్షణకు  పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు సిద్దిపేట షీటీమ్ బృందం మహిళ కానిస్టేబుల్ మమత, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాములవారి విగ్రహాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Next మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!
ADVERTISEMENT