డైలీ భారత్,పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణం గాంధీ పార్క్ సమీపంలో గల హనుమాన్ వ్యాయామశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో జెండాకు అవమానం జరిగింది. నిర్వాహకులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేశారు. జెండాను గమనించిన నిర్వాహకులువెంటనే జాతీయ జెండాను సరిచేసి మళ్లీ ఎగురవేసి గీతాలాపన చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జైపాల్ ,సపాన్ దేవ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు టప్ప కుమార్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య, అంజయ్య, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, హనుమాన్ వ్యాయామశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
News
పటాన్ చేరు లో జాతీయ జెండాకు అవమానం