| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాపు సీతాలక్ష్మి కిరణ్ మెగా ఈవెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

కాపు సీతాలక్ష్మి కిరణ్ మెగా ఈవెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు


ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు 

డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరం ఆరవ వార్డు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ గ్రౌండ్ లో ఆదివారం ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి  కిరణ్ మెగా ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి  టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ ఎస్ ఆర్ కే టి స్కూల్ మేదర్ బస్తి కొత్తగూడెం డైరెక్టర్ అత్తిరామ్ కొత్తగూడెం మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు వారి సతీమణి భారతి ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ వార్త తరంగాలు స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్ తెలంగాణ ఉద్యమకారుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కిరణ్ ఈవెంట్ ఆధ్వర్యంలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సింగర్స్ సౌజన్య శేఖర్ మధురమైన గానాలతో అందరినీ ఆకట్టుకున్నారు యాంకర్ గా శిల్ప ముగ్గుల పోటీలకు వచ్చిన గ్రామస్తులని ఉత్తేజపరచుతూ ప్రోగ్రామ్  విజయవంత చేసే దిశగా వారు యాంకరింగ్ పలువురిని ఆకట్టుకున్నది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బాబాయి బాలకృష్ణ డూప్ ఆర్టిస్టులుగా ఉస్మాన్ సురేష్ లు పలువురిని ఆకట్టుకున్నారు.జడ్జిలుగా 27వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు వారి సతీమణి స్టాఫ్ నర్స్ భారతి ఉద్యమకారుడు రాజశేఖర్ వ్యవహరించినారు మొదటి బహుమతిగా గ్రైండర్ ను రెండవ మూడవ బహుమతులుగా మిక్సీలను విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా శాలువాతో సత్కరించి బోకే అందజేసి షీల్డ్ ను  కిరణ్ ఏ టు జెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ గండికోట కిరణ్ కుమార్ ముఖ్యఅతిథితులకు అందజేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న పదిమందికి పట్టు చీరలు అందజేయడం జరిగింది . మ్యూజికల్ చైర్ పెద్దవారికి చిన్నవారికి నిర్వహించి గెలుపొందిన వారికి జీవి మాల్ గిఫ్ట్ కూపన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మజా కంపెనీ వారు ఆరుగురు కి  గిఫ్ట్ లు  అందజేయడం జరిగింది అనంత ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి తిలకించడానికి వచ్చినవారికి మజా వారు మజా లింకాలు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేయడం జరిగింది.

Previous ప్రజలకు సేవ చేసే నాయకులు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి : మహమ్మద్ ఇబ్రహీం
Next సాహితీ సమితి ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్ల గ్రంథాలయంలో సంక్రాంతి సంబరాలు
ADVERTISEMENT