డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శ్రీమహావిష్ణువు కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంజయ్య యాదవ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులతో కలిసి జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లిన ఆయన.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారా దర్శనంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ధనుర్మాస ఏకాదశి అని, తెలంగాణ ప్రజలకు, షాద్ నగర్ నియోజకవర్గ ప్రజానీకానికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే అంజయ్య తెలిపారు. అంజన్న వెంట మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్ తదితరులు ఉన్నారు..
News
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్