| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కిటకిటలాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆలయాలు

కిటకిటలాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆలయాలు

డైలీ భారత్, భద్రాచలం : రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామయ్యను దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారు 3గంటల నుంచే భక్తులు ఆలయాo దగ్గర బారులు తీరారు. 

పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. 

ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహం 12 గంటల వరకు సర్వ దర్శనాలు  వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారా ధర్శనం నుంచి భక్తులకు సీతారామస్వామి దర్శనమిస్తున్నారు.

గరుడ వాహనంపై శ్రీరామ చంద్రుడు, గజ వాహనంపై సీతమ్మ దర్శనమిస్తున్నారు. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురి, భద్రకాళి, దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. 

వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

Previous పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం
Next పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య?
ADVERTISEMENT