డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధి బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మరియు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ "ఖమ్మం జిల్లాలోని మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి తల సేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయాలనే ఆలచన మంచిదని, ఆ ఆలోచన చేసి శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేశారు.మనసున్న మారాజు కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. జైళ్ళకు కానీ కేసులకు భయపడే పార్టీ కాదని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చామని, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. రాబోవు రోజులలో కందాల ఉపేందర్ రెడ్డి ని మరలా శాసనసభ్యులు గా ప్రజలు ఆశీర్వదిస్తారని వారు పేర్కొంటూ, జిల్లా పార్టీ తరఫున కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు".
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, మాజీ జెడ్పిటిసి వర ప్రసాద్, మాజీ డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మరియు నాయకులు ఆసిఫ్ పాషా, మరికంటి రేణు బాబు, జానకి రాములు, సంజీవరెడ్డి, కృష్ణారావు, లక్ష్మణ్, బాలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.