| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు లో గుట్టలను అక్రమంగా తవ్వుకుంటున్న మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి : సేవాలాల్ సేన

జూలూరుపాడు లో గుట్టలను అక్రమంగా తవ్వుకుంటున్న మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి : సేవాలాల్ సేన

మైనింగ్ శాఖ జిల్లా అధికారి పరశురాం కి వినతి పత్రం అందజేసిన సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కళ్ల ముందే గుట్టలను తవ్వెస్తుంటే అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ మండల ఉపాధ్యక్షుడు బానోత్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా మైనింగ్ శాఖ అధికారి పరశురాం సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతు జూలూరుపాడు మండలకేంద్రంలో గత కొన్ని రోజులుగా గుట్టకు మట్టి కోరి పెట్టి ట్రాక్టర్ లతో వందలాది ట్రిప్పులు మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి మండల అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పర్మిషన్ లెటర్ చెక్ చేయాల్సిందిగా ఆయన అధికారులు కోరారు. పర్మిషన్ లెటర్ ని చెక్ చేసి అదే ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చార వేరే ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చార ఇస్తే ఎన్ని ట్రిప్పులకు పర్మిషన్ ఇచ్చారు అనేది సర్వే చేయవలసిందిగా ఆయన మండల రెవెన్యూ అధికారులను కోరారు మండల పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా, కోడై కూసే కాలంలో, ఎవరికీ తెలియకుండా ప్రజల కన్నులు కప్పి మట్టి రవాణా చేస్తున్నారు అంటే వారు ఎంత చాకచక్యంగా చేస్తున్నారో అర్థమవుతుంది ఏదిఏమైనా ఎంతటి పర్మిషన్ ఉన్నా అలా గుట్టలను కరిగించి మట్టి రవాణా చేయడం భవిష్యత్ తరాలకు పెద్ద ముప్పు ఉందని ఆయన అన్నారు, ప్రభుత్వ సంపదను దోచుకుంటున్న, అక్రమార్కులపై, వారికి సహకరిస్తున్న అధికారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, అక్రమ మట్టి తొలకాల విషయమై  మైనింగ్ అధికారి   కి పిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous సంక్రాంతికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్?
Next అక్రమ కేసులకు, అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడరు : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
ADVERTISEMENT