డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఏండ్లు గడుస్తున్నా జమకానికి ఉద్యోగుల బిల్లులు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసి DTO కార్యాలయానికి సమర్పించిన బిల్లులు ఆరు నెలలు, సంవత్సరము, రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఉద్యోగుల ఖాతాలలో ఇప్పటికీ ఇంకనూ జమకాలేదు. చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాలకు తమ అనారోగ్య ఖర్చుల కొరకు, కూతుర్ల వివాహాల కొరకు, గృహ నిర్మాణాలకు క్లెయిమ్ చేసిన మొత్తాలు ఉన్నాయి.
ఇలా పెండింగ్లో ఉన్న బిల్లులలో సరెండర్ లీవ్, డి.ఏ. ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జి.పి.ఫ్. పార్ట్ ఫైనల్ మరియు సప్లమెంటరీ శాలరీ బిల్లులు ఎన్నో ఉన్నాయి. అట్టి పెండింగ్ బిల్లుల మంజూరు కొరకు రాష్ట్ర ఖజానా శాఖకు DTO గారు ఒత్తిడి తేవాలని ప్రాతినిథ్యం చేయడం జరిగింది. DTO నవీన్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారికి మీ లేఖ ద్వారా మేము తప్పకుండా ఒత్తిడి తెస్తామని మాట ఇచ్చారు.
ఇందులో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పర్కాల రవిందర్, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా కోశాధికారి అంబటి రమేష్, జిల్లా కార్యదర్శి ఎలగొండ రవి, వద్యారం మధుసూదన్ పాల్గొన్నారు.