డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలంలోని మేళ్లబాయి తండాలో ఆదివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని తండావాసులు సాదరంగా ఆహ్వానించి, ఆయనను సత్కరించారు. విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నూతనంగా ప్రతిష్టించిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దంటూ, ఎక్కడో గ్రామాలకు సుదూరంగా ఉండే తండాలలో దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం, విగ్రహాలను ప్రతిష్టించి తమ భక్తి ప్రపత్తులను చాటుకోవడం, తమ తండాల అభివృద్ధికి తామే పాటుపడడం చాలా సంతోషాన్నిస్తుందని, అందరూ ఇలాగే ఐకమత్యంగా ఉండి తమ తండాల అభివృద్ధిలో ముందుండాలని ఆ భగవంతుని ఆకాంక్షించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నేనావత్ దేవి హన్య నాయక్, సర్పంచ్ రవి సుగుణ, బిఆర్ఎస్ యువ నాయకులు దినేష్ సాగర్, తదితర నాయకులు, తండావాసులు పాల్గొన్నారు
News
ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి