డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కార్తీక మాసంలో 41 రోజులపాటు కఠోర దీక్షతో, అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని, మండలం పాటు ప్రతిరోజు ప్రతిక్షణం అయ్యప్ప నామస్మరణలో మునిగి, రోజు కేవలం ఒక్క పూట ఆహారంతో స్వామిని సేవించే అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం చాలా అదృష్టం అని భావిస్తారు. అలాంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని అయ్యప్ప స్వామి భక్త సమాజం సాదరంగా ఆహ్వానించి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి కౌన్సిలర్లు యుగేందర్, నందిష్, శ్రీనివాస్ గౌడ్, పిల్లి శేఖర్, మాధురి నందకిషోర్, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎజాజ్.అడ్డు, తదితరులు పాల్గొన్నారు.
News
అయ్యప్ప స్వాముల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి