ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీల చీకటి ఒప్పందాలపై నిరసన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ కు తరలింపు
రాహుల్ గాంధీ ప్రధాని మోడీ అదానీల ఫోటోలను పార్లమెంటులోకి తీసుకు వెళ్లలేదా?
రాహుల్ గాంధీకి లేని ఆంక్షలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎందుకు?
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రజాస్వామ్యంలో ప్రజలకు గాని, ప్రతిపక్ష నాయకులకు గానీ, ప్రజల తరఫున పోరాడే వ్యక్తులకు గాని నిరసనలు తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదాని రహస్య చీకటి ఒప్పందాలకు నిరసనలు తెలుపుతూ వారి చిత్రపటాలతో ఉన్న టీ షర్ట్లు ధరించి అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా అసెంబ్లీ గేటు వద్ద ఉన్న పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను లోపలికి రానీయకుండా అడ్డుకోవడంతో, పార్లమెంటులోకి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ మరియు అదానిల చిత్రపటాన్ని తీసుకు వెళ్లినప్పుడు లేని ఆంక్షలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు అని తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. అనంతరం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదాని చీకటి రహస్య ఒప్పందాల చిత్రపటాలతో తెలంగాణ భవన్ లో నిరసనకు దిగారు.