షాద్ నగర్ పట్టణ అధ్యక్షులు ఎమ్మెస్ నటరాజన్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ సర్కార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సంబురాలు అంబాన్ని అంటాయి. అంతేకాదు కేసీఆర్ ఇమేజ్ తెలంగాణ సమాజంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు నవంబర్ 29 ప్రత్యేకం అని చెప్పాలి.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు ఎమ్మెస్ నటరాజన్ నేతృత్వంలో జండావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, తాండ్ర వెంకట్ రెడ్డి, మహిళ నాయకురాలు ఉమాదేవి, రాఘవేందర్ గుడ్డు యాదవ్ చీపిరి రవి యాదవ్, గుండు అశోక్ పులిజాల నవీన్ అభి తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29 న బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌గా పాటిస్తోంది. గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక నేటితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్ళు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా నేడు దీక్షా దివస్‌ను టిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ లో జరుగుతున్న దీక్షా దివస్ కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు.
2004లో అప్పటి కాంగ్రెస్ తమ ఉమ్మడి మేనిఫెస్టో లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి టీఆర్ఎస్.. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా.. తెలంగాణ వాదాన్ని అణదొక్కాలని చూసారు. దీంతో అప్పటి వైయస్ఆర్ వైఖరికి నిరసన అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలోని ప్రభుత్వాల నుంచి టీఆర్ఎస్ వైదొలగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, తెలుగు దేశం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకొని బరిలో దిగింది. కానీ ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజా రాజ్యం మూలంగా మహా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి వైయస్ఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు. ఆ తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
రోషయ్య ముఖ్యమంత్రి అయ్యాకా.. కేసీఆర్.. రాజకీయంగా తన పావులు కదిపారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏపీలో నిరసనలు వ్యక్తం కావడంతో డిసెంబర్ 23న ఈ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నోరాజకీయ పరిణామాల తర్వాత 2014 చివరి సెషన్స్ లో కాంగ్రెస్ పార్టీ .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ బేషరతుగా మద్దతు తెలిపింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయింది. ఆ తర్వాత తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే కదా..