టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాం-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు & ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-2026 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ వంచ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు1982 లో అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని ప్రజలకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలను అందించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు.ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో,మరియు ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యధిక సభ్యత్వాలను చేపించి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల మాజీ అధ్యక్షుడు చేట్కూరి నారాయణ గౌడ్,సిరిసిల్ల నియోజకవర్గ అడాక్ కమిటీ సభ్యులు తీగల శేఖర్ గౌడ్,జిల్లా నాయకులు మాలోత్ సూర్యనాయక్,మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి లొంక భాస్కర్ శర్మ,మైనంపెళ్లి రంగరావు,శనిగరం బాలరాజు తదితరులు పాల్గొన్నారు....