| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వరావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అశ్వరావుపేటలో 108 వాహనం ఏర్పాటు చేయాలి : తంబల్ల రవి

అశ్వరావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అశ్వరావుపేటలో 108 వాహనం ఏర్పాటు చేయాలి : తంబల్ల రవి

ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారికి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి

గర్భిణీ స్త్రీలు మరియు ప్రమాద బాధితులు అందుబాటులో లేని 108 వాహనం

ఇతర మండలాల నుంచి 108 వాహనం వచ్చేసరికి గాల్లో కలుస్తున్న ప్రాణాలు

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అశ్వరావుపేటలో అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడే 108 వాహనం అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం అని,మండల వ్యాప్తంగా మారుమూల ఏజెన్సీ గ్రామాల నుంచి వైద్యం కోసం అశ్వరావుపేట రావాల్సి ఉంటుంది,గర్భిణీ స్త్రీలకు మరియు ప్రమాద బాధితులకు ఈ మండలంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైనా అత్యవసరం అయినప్పుడు దమ్మపేట లేదా అన్నపురెడ్డిపల్లి నుంచి 108 వాహనం రావాల్సి ఉంటుంది,ఇతర మండలాల నుంచి 108 వచ్చేసరికి చాలా టైం పడుతున్నది,ఈలోపు ప్రథమ చికిత్స అందక చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నవి,స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి అశ్వరావుపేట మండలానికి ప్రత్యేకంగా ఒక 108 వాహనం ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు,

ఈ కార్యక్రమంలో కారం నాగేంద్ర బాబు,తోట రాజా పాల్గొన్నారు.

Previous పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య
Next ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం
ADVERTISEMENT