| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...

డైలీ భారత్, మహబూబాబాద్: ఈరోజు మహాబుబాబాద్ మండలం, ZPHS, కంబాలపల్లి పాఠశాలలో స్వయం పాలన  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులుసోమ .విష్ణు వర్ధన్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలను బోధించారు. ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత ఉత్తమమైనదో  పిల్లలకు తెలిసిందని అన్నారు . ఈ కార్యక్రమంలో DEO గా సోహెల్ ,ప్రధానోపాధ్యాయులు గా E. ధనుంజయ్ ,ఉపాధ్యాయులుగా శివ , అభిషేక్, విఘ్నేష్ , కాజల్ ,అంజలి ,PET గా ముఖేష్ వ్యవహరించారు. పిల్లలందరూ ఉపాధ్యాయులుగా వ్యవహరించినప్పుడు ఉపాధ్యాయులు అనేవారు ఎంత ఒత్తిడికి లోనవుతారు. ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత గొప్పదో వారికి తెలిసిందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ సహాయం శ్రీధర్ రెడ్డి,G. ఉప్పలయ్య,  కాసం శ్రీనువాస్ రావు,వి. తిరుపతి అల్లి సతీష్ కుమార్ ,శిభా రాణి, ఓ ఝాన్సీ , మల్లారెడ్డి M.వెంకటేశ్వర్లు ,జడ్జి లు గా వీరభద్రం, యుంగేందర్, కవిత లు పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్
Next సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు
ADVERTISEMENT