డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ ప్రభుత్వం మూగజీవాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 1962 పశువైద్య సంచార వాహనాల సేవల ద్వారా మూగజీవాలకు క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన వైద్యం అందించాలని 1962 తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బగీష్ మిశ్రా అన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, జిల్లా కోఆర్డినేటర్ ప్రణయ్ తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గల కొత్తగూడెం,ఇల్లందు, అశ్వరావుపేట, భద్రాచలం, మణుగూరు 1962 వాహనాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పశువుల వైద్యానికి ఉపయోగించే అత్యవసర ఔషధాలు, పలు రికార్డులను, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. పశువులకు అందిస్తున్న చికిత్సల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో 1962 సిబ్బంది పాల్గొన్నారు