డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు తంగళ్లపల్లి మండలం పద్మనగర్ కి చెందిన పంతం నాగలక్ష్మి భర్త విజయ్ డెలివరీ మహిళకి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని తెలియగానే మోతె రాజిరెడ్డి 28 వ సారి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకొని రక్తదానానికి ముందుకు రావాలని,ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చునని రక్తదానం,ప్రాణదానం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని అన్నారు.దేశవ్యాప్తంగా సకాలంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు.రక్త దానo చేయండి ప్రాణ దాతలు కండి అని యువతను ఈ సందర్భంగా కోరారు
News
రక్తదానం-ప్రాణదానం : మోతె రాజిరెడ్డి