| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి : ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి : ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్

అసంబద్ధ జీవో 25ని ఉపసంహరించాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జీ ఓ 25 ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు నిమిత్తం ఆర్ సి 1267 ఉత్తర్వులు శాస్త్రీయంగా లేవని వాటికి సవరణ చేయాలని, తరగతికి ఒక గది, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 11 మంది విద్యార్థులు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులే ఉండాలి,60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరు ఉపాధ్యాయులే ఉండాలనడం అసంబద్దంగా  ఉందని, పాఠశాల విద్య వ్యవస్థలో సరిపోయే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అస్తవ్యస్త విధానం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడి, ప్రమాణాలు దెబ్బతింటున్నాయని యుఎస్పిసి నాయకులు ఆరోపించారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా, 20 మందికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఒక సెక్షన్ కి ఒక పాటర్న్ చొప్పున ఉండు విధంగా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ  రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిరసన ప్రదర్శనను జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు.

జీవో 25 సవరించిన తర్వాతనే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని, గతంలో బదిలీ కాబడి రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నూతన పాఠశాలల్లో విద్యార్థుల కు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని, బదిలీలు పదోన్నతులు ఫిర్యాదులను సానుకూలంగా పరిష్కరించాలని, యూఎస్బీసీ నాయకులు డిమాండ్ చేశారు.


USPC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏఓ రామ్ రెడ్డి గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో యూఎస్బీసీ నాయకులు కొమ్ము రమేష్, పాతూరి మహేందర్ రెడ్డి, గోల్కొండ శ్రీధర్, 

పాకాల శంకర్ గౌడ్, గుండమనేని మహేందర్ రావు, దోర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రమానాద్ రెడ్డి, దొంతుల శ్రీహరి, ఆవురం సుధాకర్ రెడ్డి, కుమ్మరి మల్లేశం కర్రల రాజలింగం, పిట్టల దేవరాజు, మరాటి అజయ్  బెజగం సురేష్, శ్రీనివాస్  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Previous "హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో కర్ర సాము పై ఉచిత శిక్షణ"
Next నస్రల్లాను అంతమొందించిన ఇజ్రాయెల్‌.
ADVERTISEMENT