| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రతిఘటనా పోరాటానికి స్ఫూర్తి చిట్యాల ఐలమ్మ : షాద్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

ప్రతిఘటనా పోరాటానికి స్ఫూర్తి చిట్యాల ఐలమ్మ :  షాద్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

ప్రతిఘటనా పోరాటానికి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

షాద్ నగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ఆత్మగౌరవ ప్రతిక అని షాద్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అదేవిదంగా  ప్రతిఘటనా పోరాటానికి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వై. అంజయ్య యాదవ్ లు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఘనంగా జయంతి వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకుందామని అన్నారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని తెలిపారు.

చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే.. పదేండ్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలిప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ, ప్రగతి కార్యాచరణను అమలుచేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలతో పలు పథకాలను అమలుచేసి వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిపిందన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారంగా నిర్వహించాలని నిర్ణయించి అమలుచేసిందన్నారు. బలహీన వర్గాలు, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనమర్పించే ఘన నివాళి అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, అంజయ్య యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్స్,కొత్తూరు దేవేందర్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Previous మా మీద కోపం.. ఆడబిడ్డల మీద చూపిస్తున్నారా?: KTR
Next తప్పకుండా డీజే పెడ్తం: కేసులు పెట్టండి.. ఏమైనా చేసుకోండి : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ADVERTISEMENT