| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేస్తున్న రేషన్ షాప్ డీలర్లు

వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేస్తున్న రేషన్ షాప్ డీలర్లు

రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్‌ షాపుల కేటాయింపు.. వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితుల నిరసన

రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తే ఉన్న పళంగా రద్దు చేసి మా కుటుంబాలు రోడ్డున పడేశారని అవేదన వ్యక్తం చేశారు

పాత వారికే రేషన్ డీలర్‌ షిప్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ
ADVERTISEMENT