| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి

బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి

డైలీ భారత్, బద్లాపూర్:ఓ పాఠశాలలో ఇటీవల ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన స్వీపర్ అక్షయ్ షిండే  సోమవారంనాడు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు.

అక్షయ్ షిండే మాజీ భార్య తాజాగా ఇచ్చిన ఒక ఫిర్యాదుపై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిందితుడిని తలోజా జైలు నుంచి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కస్టడీలోకి తీసుకుంది. విచారణ కోసం థానే తీసుకువెళ్తుండగా ముంబ్రా బైపాస్ వద్దకు వాహనం చేరుకున్న సమయంలో ఒక పోలీసు అధికారి నుంచి రివాల్వర్ లాక్కున్న షిండే రెండు నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో షిండే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని కల్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Previous బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసినప్పుడే స్థానిక సంస్థల్లో గెలుస్తాం
Next రిపోర్టర్లకు,యూట్యూబ్ ఛానల్ లకు అక్రిడేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం.
ADVERTISEMENT