డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు ఎమ్మెల్యే కాలే యాదయ్య.. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి సంబంధించిన 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి కార్యక్రమానికి హాజరయ్యి, లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,ప్రభుత్వం ద్వారా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, మహిళలు యువతులు పాల్గొన్నారు...
News
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.