వినాయక చవితి నిమజ్జన వేడుకల్లో ఎవరికి ఇబ్బంది కలగొద్దు
శంషాబాద్ డీసీపీ బి. రాజేష్
షాద్ నగర్ డివిజన్ స్థాయి సమావేశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వచ్చే వినాయక చవితి పండగ నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ డీసీపీ బి రాజేష్ సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం శంషాబాద్ డీసీపీ, షాద్ నగర్ ఎసిపి రంగస్వామి ఆద్వర్యంలో పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో వినాయక చవితి పండగ సందర్బంగా షాద్ నగర్ సబ్ డివిజన్ కి సంబంధించి అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజేష్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్బంగా షాద్ నగర్ డివిజన్ చుట్టూ పక్కల చెరువుల వద్ద తీసుకోవలసిన చర్యల పట్ల సూచనలు చేశారు. నిమజ్జనం సందర్బంగా బక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలియజేశారు. ఈ అధికారుల సమన్వయ సమావేశానికి ఆర్‌డిఓ కార్యాలయ ఏఓ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకన్న, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జగన్, పలు మండలాల ఎంఆర్‌ఓ లు, ఎంపిడిఓ లు, ఆర్&బి డిఈ, ఏఈ లు, ఎలక్ట్రిక్ ఏఈ లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కడ్తాల్ ఇన్స్పెక్టర్, అమనగల్ ఇన్స్పెక్టర్ లు తదితర అధికారులు పాల్గొన్నారు..