దొందు దొందే జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ భాగ్యరాజ్ వెల్లడి
డైలీ భారత్, తూప్రాన్: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కేంద్రం ఢిల్లీ బిజెపి నాయకుల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెప్పించు కున్నారని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఆరోపించారు అనంతరం ఒకవైపు బిజెపి ప్రభుత్వంలో టిఆర్ఎస్ వీలీనమైతున్నట్లు కొన్ని రోజుల నుంచి పత్రికల్లో రావడం చకాచకా జరిగిపోవడం కవితమ్మకు బెయిల్ మంజూరు కావడం ప్రజల్లో ఇదో వింతగా కనిపించడం ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణాల్లో ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుడ్డ భాగ్యరాజ్ తెలిపారు అదేవిధంగా ఇన్ని రోజులు గడుస్తున్న తన సొంత కూతురు కవిత పై ఎలాంటి వివరణలు పేపర్ ద్వారా ప్రకటనలు ఇవ్వకుండా కేసీఆర్ మౌనం ఎందుకు ఉండడం ప్రజలకు అర్థమవుతుందని ఇప్పటికైనా కేంద్రంతో మాయమాటలతో కవితకు బెయిల్ రావడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఒకరికొకరు అనుకుంటున్నారు అని కాంగ్రెస్ జిల్లా నాయకులు భాగ్యరాజ్ తెలిపారు అదేవిధంగా బిజెపి ,బీఆర్ఎస్ కుమ్మక్కు వల్లే ఇది సాధ్యమైందన్నారు ఈ బెయిల్ తో బిజెపిలో టిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు అధికార పార్టీ కాంగ్రెస్ , సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే బిజెపి, బీఆర్ఎస్ ఒకటవుతున్నాయని ఆయన మండిపడ్డారు అని కాంగ్రెస్ జిల్లా నాయకులు భాగ్యరాజ్ పేర్కొన్నారు