| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గత ప్రభుత్వం పాలకవర్గానికి పూర్తి బాధ్యతలు ఇవ్వలేకపోయింది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గత ప్రభుత్వం పాలకవర్గానికి పూర్తి బాధ్యతలు ఇవ్వలేకపోయింది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కాలనీలల్లో మౌలిక సౌకర్యాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెడుతాం...

7వార్డులో కాలనీల అభివృద్ధిపై  ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు, పాలకవర్గాలకు పూర్తి అధికారాలు కల్పించలేకపోవడంతోనే మున్సిపాలిటీలా అభివృద్ధి అంతంతమాత్రంగానే కొనసాగిందని, తమ ప్రభుత్వం మాత్రం అధికారులకు,  పాలకవర్గానికి పూర్తి అధికారం ఇవ్వడానికి కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో ఆదివారం ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేలుపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ... మున్సిపాలిటీ లో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీ వారు ఇండ్ల నిర్మాణం అనుమతి రూపంలో, టాక్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులను ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా అభివృద్ధి మాత్రం చేయటం లేదన్నారు. గత ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టం లో  పాలకవర్గాలకు అధికారాలు కల్పించలేదని వాపోయారు. వార్డు పరిధిలోని ఆనంద్ కాలనీ, హైటెక్ కాలనీ, సూర్య కాలనీ, తిరుమల టౌన్షిప్ లలో అభివృద్ధి పనులకు ఇప్పటికే 3 కోట్లు కేటాయించానని, అవసరమైతే అదనంగా నిధులు కేటాయిస్తానని ఆయన కాలనీ వారికి హామీ ఇచ్చారు. కౌన్సిలర్లకు ఎన్నో రకాల పనులు చేయాలని ఉన్నా కానీ చట్టంలో మాత్రం అధికారం కల్పించలేదు అన్నారు. రానున్న కాలంలో పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు కల్పించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్కుల అభివృద్ధికి చాలా డబ్బులు ఖర్చు చేసిన గాని పూర్తి స్థాయిలో పార్కులను అభివృద్ధి చేయలేకపోయారని, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. పెరుగుతున్న జనాభా కు తగ్గట్టుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలను అభివృద్ధి చేయుటకు మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన కాలనీ వాసులకు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే శంకర్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వo, బాబర్ ఖాన్, పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొప్పునూరి ప్రవీణ్, రిటైర్ ఉపాధ్యాయులు గంగిరెడ్డి, శ్రీను నాయక్, కాలనీ అధ్యక్షుడు లింగం యాదవ్, కాలనీ యూత్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కిరణ్, విఠల్ గౌడ్, మాణిక్య ప్రభు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Previous హైడ్రా రిపోర్ట్ : 18 చోట్ల కూల్చివేతలు.. 43 ఎకరాలు స్వాధీనం
Next శ్రీ కృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నాం : సిఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT