| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

3 లీటర్ల గుడుంబ, 3000 రూపాయల మద్యం సీజ్ : డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

 3 లీటర్ల గుడుంబ, 3000 రూపాయల మద్యం సీజ్ : డిఎస్పీ చంద్రశేఖర్  రెడ్డి

నేరాల నియంత్రణకే "కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం".

గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

గ్రామాలలో స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 3 ఇండ్లలో 120 లిటట్ల జాగిరి ధ్వసం, 3 లీటర్ల గుడుంబ సీజ్, బెల్ట్ షాప్ లో 3000 రూపాయల మద్యం సీజ్.

సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్  రెడ్డి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఆదేశానుసారం ఈ రోజు సాయంత్రం వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, గ్రామంలో సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సబంధించిన వాహన దారులకు సరైన పత్రలు చూపించి వాహనాలు తీసుకవెల్లచని, గ్రామంలో అక్రమ గుడుంబా తయారీకి కోసం నిల్వ ఉంచిన 120 లీటర్ల జాగిరి,4 లీటర్ల గుడుంబా,అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్ లో 3000 రూపాయల విలువ గల మద్యం స్వాధీన పర్చుకొని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.


అనంతరం డిఎస్పీ మట్లాడుతు..

ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని,  గ్రామాల్లో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు,లేదా డయల్ 100 కాల్ కు చేసి సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.

గ్రామాల్లో యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి,గుడుంబా తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలల్లో,నేరాల నియంత్రణ లో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ ,ఎల్లగౌడ్, గణేష్, రాంమ్మోహన్,పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous వివాహ వేడుకలకి హాజరైన ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి
Next అక్రమంగా కట్టిన N convention ని కూల్చివేసిన హైడ్రా
ADVERTISEMENT