త్వరలో కొందుర్గ్ మండల స్వరూపమే మారబోతుంది.
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గ్ మండల పర్యటనలో భాగంగా మినీ స్టేడియం నిర్మించబోతున్న సర్వే నెంబర్ 19 ను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఆ తర్వాత నియోజవర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే నెంబర్ 109/2 లో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను పరిశీలించారు. మండలంలో నిర్మించే మినీ స్టేడియం , ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు 4 వరుసల రోడ్డుతో కొందుర్గ్ మండల స్వరూపమే మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని, కొందుర్గ్ మండలం యొక్క అభివృద్దే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.