| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రాఖీ కట్టిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రాఖీ కట్టిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:  రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీకట్టేందుకు ఉత్సహం చూపుతున్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుని రక్తంపంచుకు పుట్టిన సోదరులకు రాఖీలు కట్టి బహుమతులు అందుకుంటున్నారు. అలాగే వారి ఆశీర్వచానలు పొందుతున్నారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధులందరికి మహిళలు రాఖీలు కట్టేందుకు క్యూకడుతున్నారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు, ఎంపీలు, మహిళా నేతలు రాఖీలు కట్టి వారి ఆనందాన్ని తెలియజేశారు. మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు సీఎంకు రాఖీ కట్టారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ కట్టే సమయంలో ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తె, మనవడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలా నేతలు రాఖీ కట్టడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సుజాత రాఖీ కట్టారు.

ముఖ్యమంత్రికి రాఖీ కట్టడంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ... సీఎంకు కూడా రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపానని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు. సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మాయిలను నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు. మహిళా భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతినభూనాలన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంస్కృతి అని అన్నారు. ప్రతి అడపడుచు, అన్నదమ్ములతో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకునే పండగ రాఖీ పండగ అని అన్నారు. సోదరులు అందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పులు వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందన్నారు. ప్రతి సోదరుడు తన సోదరికి సమాజంలో ఎలా సెక్యూరిటీ, గౌరవం పొందాలి అనుకుంటారో.. అలాగే ప్రతి ఒక్కరూ తమ అక్క చెల్లమ్మల మాదిరి సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని అన్నారు. ప్రతి మహిళను మన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవన్నారు. ‘‘ ఆడబిడ్డలకు స్వేచ్చగా తిరేగే అవకాశం ఇద్దాం.. ఎదగనిద్దాం ’’ అంటూ అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు తెలిపారు..

Previous షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు
Next అన్నగా అండగా నిలుస్తాం : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT