పీర్లచెరువు కు మినీ ట్యాంక్ బండ్ మరియు బస్టాండ్ మంజూరి చేయించినందుకు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు మరియు మైనార్టీ నాయకులు..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో ప్రసిద్ధి చెందిన గల హజ్రత్ సయ్యద్ జహంగీర్ పీర్ దర్గా పీర్ల చెరువును మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయుటకు మరియు బస్టాండ్ స్థలం మంజూరి చేయించినందుకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామస్తులు, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో గ్రామాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆగిరు రవికుమార్ గుప్తా, బాబు ముదిరాజ్, సయ్యద్ ఖజా, శోకత్, పంతులు నర్సింహా, సాధక్, రియాజ్, రమేష్ ముదిరాజ్, సాయిలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..