| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలి:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలి:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

20వ వార్డులో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు పటేల్ రోడ్డులో కాంగ్రెస్ యువ నాయకులు మన్నే రవి, నీరటి వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు హాజరై మహనీయుల చిత్రపటాల వద్ద పువ్వులు  చల్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని  ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను పొందగలిగామని అన్నారు. మహనీయుల పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, దేశ అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదయ్య యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్, రఘు నాయక్, బాలరాజ్ గౌడ్, అగ్గనూరు విశ్వం, బస్వమప్ప, చల్లా శ్రీకాంత్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్, జమ్రుద్ ఖాన్, అందే మోహన్,  నర్సింగ్ రాజ్, జగదీశ్వర్(జగ్గు), కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous మానవ అవయవాల అక్రమ రవాణా
Next ఎర్రకోట పై జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ADVERTISEMENT