ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్.
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము,అమెరికా,కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు.ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు.త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని తెలిపారు.పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి
మూడు రింగ్స్ ఉన్నాయని అన్నారు.ఇందులో భాగంగా మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్,రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అన్నారు.అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పారు.వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పమన్నారు.కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను,హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.రాజీవ్ గాంధీ గారి కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడిందని చెప్పారు.ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారని గుర్తు చేశారు.సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు.హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు.రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందని చెప్పారు.రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా,హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవన్నారు.హైదరాబాద్,సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు.మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందన్నారు.మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు... మా పోటీ ప్రపంచంతో పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదన్నారు.
హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం.
పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నామని తెలిపారు..రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక,రాజేందర్ నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు...