చికెన్ సెంటర్ ,టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలుగంటి మధుసూదన్ రెడ్డి, ఎంఎల్ఎ కాలే యాదయ్య
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:యువత స్వయం ఉపాధి వైపు రాణించాలి అని ఏలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం చందన్వెల్లి గ్రామంలో జిఎంఆర్ చికెన్ సెంటర్, టీ స్టాల్ ను చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలుగంటి మధుసూదన్ రెడ్డి.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు రాణిస్తూ వ్యాపార రంగాలలో రాటుదేలాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సమయం వృధా చేయకుండా మంచి ప్రణాళికలతో యువత వ్యాపార రంగం వైపు మొగ్గు చూపాలని చెప్పారు. సమాజంలో వ్యాపారులకు మంచి గుర్తింపు ఉందని ఎంత లాభసాధిగా ఉంటుందని పేర్కొన్నారు.