డైలీ భారత్, వేములవాడ:తెలంగాణ రాష్ట్రంలో ప్రము ఖ శైవక్షేత్రమైనా వేముల వాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఈరోజు నుండి బ్రేక్ దర్శనాలు ఏర్పా టు చేస్తున్నట్లు ఆలయ ఈ ఈ రాజేష్ తెలిపారు.
ఇక్కడ శివుడు.. రాజరాజే శ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించు కొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది.
తిరుమలలో భక్తుల కోసం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.300 తీసుకొని, స్పెషల్ దర్శన టికెట్ ఇస్తారు. టీటీడీ యాప్, ఆన్ లైన్‌లో మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.
వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే వీటీఏడీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్‌కు పంపించారు. ఆమోదం తెలుపడంతో ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది. బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
ఉదయం 10.15 గంటల నుంచి 11.15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శన సమయం అని వైటీడీఏ పాలకవర్గం ప్రకటించింది. ప్రతి రోజు 300 వందల మంది నుంచి 500 మంది వరకు బ్రేక్ దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు.
బ్రేక్ దర్శనం కోసం ఒక్కొక్క రికి రూ.300 టికెట్ తీసు కొని, ఆ టికెట్‌పై లడ్డూ ఉచితంగా అందజేస్తారు బ్రేక్ దర్శనం కోసం టైమ్ కేటాయించడంతో ఆ సమయంలో భక్తులు దర్శించుకునే వీలు ఉంది. మిగతా భక్తుల రద్దీ కూడా తగ్గుతుందని పాలకమం డలి అంచనా వేసింది.
ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఆ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రవేశ పెట్టారు..