| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ సాంప్రదాయం బోనాలు : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

తెలంగాణ సాంప్రదాయం బోనాలు : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

బుగ్గోనిగూడలో ఘనంగా బోనాల పండుగ

డప్పుల దరువులు..శివసత్తుల ఆటపాటలతో

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సాంప్రదాయం బోనాల పండుగని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని బుగ్గోనిగూడలో గ్రామంలో బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..బోనాలు తెలంగాణ సాంప్రదాయమని ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని ప్రజలందరినీ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ జగన్మాతను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బుగ్గోనిగూడ మాజీ సర్పంచ్ నీలమ్మ రాజు,మాజీ ఉప సర్పంచ్ శ్రీను,సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్,బండి రమేష్,బండోనిగూడ సర్పంచ్ జట్ట కుమార్,బండ మల్లేష్,మాజీ వార్డ్ సభ్యులు,బిఆర్ఎస్ నాయకులు,గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Previous డీజే నిర్వాహకులకు వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక
Next వడివడిగా వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్
ADVERTISEMENT