| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోచమ్మ దేవస్థానంలో ప్రసాదం అమ్ముకొనుటకు టెండర్లు : ఆలయ ఈవో మారుతి

పోచమ్మ దేవస్థానంలో ప్రసాదం అమ్ముకొనుటకు  టెండర్లు :  ఆలయ ఈవో మారుతి

డైలీ భారత్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని శ్రీ పోచమ్మ దేవస్థానంలో లడ్డు పులిహోర అమ్ముకొనుటకు మరియు కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకొని హక్కులకు గాను టెండర్లు పిలుస్తున్నట్లు ఆలయ ఈవో మారుతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి టెండర్ కాలపరిమితి 01-09-2024 నుండి 31-08-2025 వరకు అనగా ఒక సంవత్సరం వరకు వర్తిస్తుంధన్నారు. లడ్డు, పులిహార ప్రసాదం కొరకు లక్ష రూపాయల డిపాజిట్ మరియు కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకొనుటకు 20వేల డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని, టెండర్ ఫారం ఈ నెల 28 వ తేది నుండి 29 వ తేది ఉదయం 10 గంటల వరకు పొందవచ్చన్నారు. టెండర్ కం బహిరంగ వేలం 29 న మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని , ఉదయం గం. 11.30 ని. లలోపు టెండర్ వేయాలని ఈఓ తెలిపారు. టెండర్ దరఖాస్తుదారుడికి ఏదేని జాతీయ బ్యాంకులో అకౌంట్ ఉండి, టెండర్ రోజున పోస్ట్ డేటెడ్ చెక్ తప్పకుండా తీసుకుని రావాలని తెలిపారు.

Previous తంగళ్ళపల్లి కానిస్టేబుల్ కు ప్రశంస పత్రం
Next జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు
ADVERTISEMENT