| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఐపై సీపీ ఆగ్రహం : రౌడీషీటర్ల వివరాలు తెలియదా..?

సీఐపై సీపీ ఆగ్రహం : రౌడీషీటర్ల వివరాలు తెలియదా..?

డైలీ భారత్,  హైదరాబాద్: ఆయనో పోలీస్ స్టేషన్ కు ఆఫీసర్ కానీ అతని స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై అన్ని తెలుసుండాలి అయితే ఉన్నతాధికారి రౌడీషీటర్ల వివరాలు అడిగినప్పుడు ఆయన చెప్పలేకపోయారు దీంతో అతనిపై కమిషనర్ చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ల వివరాలు చెప్పమంటే తెల్లమొహం వేసిన ఇన్స్పెక్టర్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య బదిలీ వేటు వేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిత్యం రౌడీ షీటర్లు హల్చల్ చేస్తూ ఉండే పోలీస్ స్టేషన్లలో బొరబండ ప్రాంతం ఒకటి సౌత్ జోన్ మినహాయిస్తే హైదరాబాద్ వెస్ట్ జోన్‌లోనూ పలువురు రౌడీషీటర్లు అలజడి సృష్టిస్తుంటారు ఎన్నికల సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య అన్ని స్టేషన్లను ఆకస్మాత్తుగా సందర్శిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం బొరబండ పోలీస్ స్టేషన్‌ను సీపీ శాండిల్య సందర్శించారు అయితే కమిషనర్ వచ్చిన సందర్భంలో బొరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్‌తో పాటు వీధుల్లో నిర్లక్ష్యం వహించడం కనిపించింది. స్థానికంగా ఉండే రౌడీషీటర్ అడ్రస్ చెప్పాలని సీపీ సందీప్ ఇన్స్పెక్టర్ ను కోరారు.

అయితే రౌడీ షీటర్ల వివరాలు తెలపడంలో ఇన్స్పెక్టర్ విఫలమయ్యారు తాను పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల వివరాలు తెలుపలేకపోవటంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా ఉండే రౌడీషీటర్ అడ్రస్సులు కూడా తెలియకపోవడం హాస్యాస్పదం అంటూ ఇన్స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లపై స్థానిక ఇన్స్పెక్టర్ ప్రకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది అలాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈ స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వివాదాస్పదంగా మారింది.

పోలీస్ కమిషనర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అడిగినా సదరు ఇన్స్పెక్టర్ దగ్గర సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది దీంతో బొరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య వెంటనే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వెంటనే సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Previous కాళేశ్వరం మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు
Next నగరం లో భారీ హవాలా గుట్టురట్టు చేసిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు
ADVERTISEMENT