| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహతి డిగ్రీ కాలేజ్ లో ఐసీఐసీఐ జాబ్ మేళా

మహతి డిగ్రీ కాలేజ్ లో ఐసీఐసీఐ జాబ్ మేళా

రేపు (24న) మహతి డిగ్రీ కాలేజ్ లో ఐసీఐసీఐ జాబ్ మేళా

రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల భర్తీ

ఎంపికైన వారికి రూ.3 లక్షల వేతనం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దేశంలో ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ, ఎన్ఐటీ సంయుక్తంగా పట్టణంలోని మహతి మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ప్రతినిధి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. 

రెండు రాష్ట్రాల్లోని బ్యాంక్ శాఖల్లో ఖాళీగా ఉన్న రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండి పాతికేళ్ల లోపు వయసు ఉండి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిసిప్లిన్ లో డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ, యువకులు మేళాలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. 

డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మేళాలో పాల్గొనవచ్చునన్నారు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించాక ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2.6 నుంచి 3.0లక్షల వార్షిక వేతనం లభిస్తుందన్నారు. 

అర్హతలు ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్ ప్రతులు, ఆధార్కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు.

https://shorturl.at/r0r4U వెబ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి గాని లేదా నేరుగా సోమవారం ఉదయం 9 గంటలకు మహతి డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

మరిన్ని వివరాల కోసం 63015 78379 సెల్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు.

Previous సంక్షోభం అంచున బీఆర్ఎస్..!?
Next నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి
ADVERTISEMENT