| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆద్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆద్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

పోరాటం రాహుల్ తత్వం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ లో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఘనంగా జన్మదిన వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యక్తిత్వమని, పోరాట తత్వమే ఆయనను ఒక రాజకీయ యోధుడిగా నిలబెడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తెలంగాణ తెలంగాణ ప్రజల తరఫున  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథమన్నారు. త్యాగం, పోరాట వారసత్వం ఆయన తత్వమని శంకర్ అన్నారు. ఆయన తెలివైనవాడని.. భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి శంకర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య యువ నేత పురుషోత్తం రెడ్డి అలీమ్ షకీబ్, సయ్యద్ ఖదీర్, పులిమామిడి రాజేష్ గౌడ్, రాయికల్ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి లింగం, మురళీ మోహన్ అప్పి, శ్రీహరి గౌడ్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు..

Previous హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. 550 మందికి పైగా మృతి!
Next అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి
ADVERTISEMENT