డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణలోని మల్టీ జోన్-1(వరంగల్) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతోపాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు.
News
10 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్!