| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

36.436 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

36.436 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 36.436 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. మరియు సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు

ఈ రోజు సిరిసిల్లలోని రగుడు వద్ద గలా డంప్ యార్డ్ నందు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు.జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగులబెట్టుట జరుగుతుందని తెలియజేసారు.గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఎస్పీ వెంట అదనపు డీఎస్పీ చంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ యాదగిరి, టౌన్ సి.ఐ రఘుపతి, సిబ్బంది .

Previous ZPHS చంద్రంపేట విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ పంపిణి
Next బాలల హక్కులను గౌరవిద్దాం, బంగారు భవితకు పునాది వేద్దాం : హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ
ADVERTISEMENT