| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యా కమీషన్ ఏర్పాటు నిర్ణయం...హర్షణీయం :TSUTF జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

విద్యా కమీషన్ ఏర్పాటు నిర్ణయం...హర్షణీయం :TSUTF జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF )రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఈరోజు కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో సిరిసిల్లలో జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ ప్రకటించడం, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేసి, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఈ ప్రమోషన్ల షెడ్యూల్ లోనే భర్తీ చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని,సిపిఎస్ రద్దు కొరకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు అంబటి రమేష్, జిల్లా కోశాధికారి పర్కాల రవీందర్, జిల్లా కార్యదర్షులు ఆడెపు శివకుమార్, జంగిటి రాజు బాధ్యులు లక్ష్మణ్, నరేష్, సతీష్ మొదలైన వారు పాల్గొన్నారు.

Previous నేటి నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి
Next బడికి వేళయే...
ADVERTISEMENT