| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ZPHS చంద్రంపేట

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ZPHS చంద్రంపేట

డైలీ భారత్, చంద్రంపేట: ఈ రోజు ప్రో జయశంకర్ బడిబాట కార్యక్రమంలో బాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపేట ఉపాధ్యాయులు చంద్రంపేట లోని ఒడ్డెర కాలనిలో బడిబాట కార్యక్రమంని నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులని కోరారు. మే నెలలో ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థిని తాడేపు జయ 9.7 జిపిఏ సాధించి తెలుగు మీడియంలో విభాగంలో జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచిందని అదేవిధంగా లక్ష్మి ప్రసన్న 9.3, రేవతి 9.2 జిపిఏ సాధించిందని తెలిపారు..ప్రభుత్వ పాఠశాలలో నిస్నాతులయిన ఉపాధ్యాయులు ఉంటారని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని చేర్పించి ఉపాధ్యాయల సేవలు వినియోగించుకోవని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కరికే పద్మ, కొండికొప్పుల రవి, గువలకొండ శ్రీనివాస్,  ముంజ రమ,  కరికే శ్రీనివాస్, రాజకుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Previous టోల్ అడిగారని టోల్ గేట్‌నే లేపేశాడు
Next పాలిటెక్నిక్ తో అపార ఉద్యోగ అవకాశాలు : పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాజగోపాల్
ADVERTISEMENT