| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడలో భక్తుల సందడి

వేములవాడలో భక్తుల సందడి

డైలీ భారత్, వేములవాడ:  వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. స్వామివారికి ఇష్టమైన సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.


#vemulawada

Previous మోడీ ప్రమాణస్వీకారం వేళ ఉగ్రదాడి?
Next ప్రధానిగా మోదీ తొలి సంతకం... దానిపైనే
ADVERTISEMENT