డైలీ భారత్, న్యూఢిల్లీ: భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీ రావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. "భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి" అని Xలో నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపతి మురుము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.
News
రామోజీ రావు మరణం బాధాకరం: ప్రధాని మోదీ