| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు భారత్ తో బంగ్లాదేశ్ డీ

నేడు భారత్ తో బంగ్లాదేశ్ డీ

డైలీ భారత్, పూణే: ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌,బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పై కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకుంది, వర్ష సూచన మేరకు  అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

ఈ టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు..నాలుగో విజయం కోసం బంగ్లాతో ఈరోజు తలపడనుంది, మ్యాచ్‌కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

కాగా, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింతే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ద‌క్కుతుంది. ఒక్క పాయింట్‌ వెనుకబడినా సెమీఫైనల్‌ రేసులో భార‌త్‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇక‌..లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సైమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వర్షంతో బంగ్లా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే ఒక పాయింట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు వర్షం కారణంగా ఏ మ్యాచ్‌ కూడా రద్దుకాకపోవడం ఊరట కలిగించే విషయం. మరో విశేషం ఏమిటంటే భారత్ టీం ను ఓడిస్తే బంగ్లా ఆటగాళ్లతో డేటింగ్ కు వస్తానని ఓ పాకిస్తాన్ ముద్దుగుమ్మ ఆఫర్ ఇచ్చింది. చూడాలి మరి..

Previous అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
Next మానవత్వం చాటుకున్న పోలీసులు.
ADVERTISEMENT