| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీ రైతుల క్షేమం కోరుతుంది : ఎంపీటీసీ కృష్ణారెడ్డి

కాంగ్రెస్ పార్టీ రైతుల క్షేమం కోరుతుంది : ఎంపీటీసీ కృష్ణారెడ్డి

బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బురద చల్లే కార్యక్రమాలు ఆపాలి యువసేన అధ్యక్షుడు పాంబండ శంకర్ ఆగ్రహం

ప్రతి సంవత్సరంలో అకాల వర్షాలు పడతాయని బి ఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటు పిఎసిఎస్ డైరెక్టర్ నర్సింలు, మాజీ ఎంపిటిసి సిద్ధి రాములు గౌడ్ వెల్లడి

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ అలియాస్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట ఎంపిటిసి కృష్ణారెడ్డి మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధి రాములు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎలాంటి పనులు లేక అకాల వర్షం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము వర్షాలు పడతాయని తెలియని పరిస్థితిలో ఉన్నారు అని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులను ఓర్వలేక చిత్రీకరించి కాంగ్రెస్ వారి మీద లేని ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆగ్రం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా మాసాయిపేట పిఎసిఎస్ డైరెక్టర్ ఊదండపురం నర్సింలు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం సేకరిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎల్లవేళలో ఉంటూ లారీలను రప్పిస్తూ ధాన్యాన్ని కొంటున్నామని డైరెక్టర్ నర్సింలు అన్నారు ప్రతి సంవత్సరంలో అకాల వర్షాలు పడతాయని ప్రతి ఒక్కరికి తెలుసని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తపరిచారు గత 7, 8, సంవత్సరాల నుండి నేను చేస్తున్న పరిపాలనలో ఇప్పటివరకు మాసాయిపేటలో ఎలాంటి కొదవ లేకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా ఎల్లవేళల్లో ఉండి వారికి డబ్బులు విషయంలో కానీ ధాన్యం కాంటా విషయంలో గానీ రైస్ మిల్లల్లోకి పంపియడం గాని మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం మొదటగా పేరు వచ్చిందని డైరెక్టర్ ఊదండపురం నర్సింలు అన్నారు అదేవిధంగా గత వారం రోజుల  అదేవిధంగా గత 15 రోజుల నుండి రైస్ మిల్లల్లో లారీలు వర్షాల వల్ల దిగబడి ఉండడంతో ఆలస్యం అయినందు నా లారీలు సమయానికి రాలేదు ఇప్పటికైనా ఈ మూడు నాలుగు రోజులలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా లారీలలో తరలిస్తామని అన్నారు అనంతరం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు చేసిన బురద జల్లే కార్యక్రమాలను చేపట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఖండించారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సేవలు జీర్ణించుకోలేక ఎగతాళితో మాట్లాడుతూ రైతులను ప్రక్కదవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రాజిరెడ్డి మాట్లాడారు అదేవిధంగా కాంగ్రెస్ యువసేన పాం బండ శంకర్ యువసేన నాయకుడు మాట్లాడుతూ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి లేనిపోని కార్యక్రమాలు చేపడితే గ్రామాల్లో సహించే ప్రసక్తే లేదని ఆగ్రం వ్యక్తపరిచారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను జీర్ణించుకోలేక ఒకపక్క అవినీతిని తుడిచేసుకుంటూ వస్తూ ఒకపక్క రైతులకు న్యాయం చేసుకుంటూ బోనస్ 500 రూపాయలు మాట ఇచ్చి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అని అన్నారు అదేవిధంగా రైతులు వారి ధాన్యం కాంటబెట్టిన ఐదు రోజులలో డబ్బులు పడుతున్నాయని దుంపల జైలు రైతు అన్నారు ఇప్పటికైనా బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరైన సమయంలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆగ్రహం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ తాజా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు మాజీ వార్డ్ సభ్యులు గుండారం శ్రీనివాస్ , జంగిటి భూస్వామి, దుంపల జైలు, రమేష్, జగదీష్ గౌడ్ తదితరులు రైతులు పాల్గొన్నారు

Previous ఏసీబీ వలలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్
Next కొనుగోలు కేంద్రంలో ధాన్యం త్వరగా ఎగుమతి జరిగేలా చూడాలి
ADVERTISEMENT