| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పై కేటీఆర్ కీలక వాఖ్యలు !

కాంగ్రెస్ పై కేటీఆర్ కీలక వాఖ్యలు !

డైలీ భారత్, హైదరాబాద్: వరిపంటకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై షాకింగ్ పోస్ట్ పెట్టారు. 

ఇది ప్రజా పాలన కాదని.. రైతు వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన.. గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ?? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ?? ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు

కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్.

Previous రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహయం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా 1995 బ్యాచ్ ఏ. ఆర్ సిబ్బంది
Next డీజీపీ వాట్సప్ ఫోటోతో సైబర్ క్రైమ్
ADVERTISEMENT