| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోపా ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

పోపా ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా)రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లాడుతు అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నెల రోజుల శిక్షణ కోసం ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను పోపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు వివరించినారు.

8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు బోధిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 125 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించినారు.

10 మంది ఇంగ్లీష్ విషయ నిపుణులచే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంగ్లీష్ బాషా పట్ల విద్యార్థుల్లో ఉన్న వ్యాకులత తొలగించడం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోపా సభ్యులు గాజుల ప్రతాప్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.

పోపా అత్యుత్తమ ఉపాధ్యాయులచే విద్య భోధన చేస్తున్నదని తెలిపారు. ఏటువంటి విషయాన్నైనా నేరుగా అడిగి తమ సందేహాలను తీర్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

మండల విద్యాధికారి దూస రఘుపతి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మోతిలాల్, పోపా సభ్యులు గాజుల ప్రతాప్, దూస రఘుపతి, మచ్చ ఆనందం వాసాల హరి ప్రసాద్, బైరి రవీందర్, కొక్కుల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, ఆంకారపు జ్ఞనోభ,ఆడేపు వేణు, శ్రీపతి భూమేష్,ఇంగ్లీష్ విషయ నిపుణులు బూర శ్రీనివాస్, గెంట్యాల భూమేశ్ , చేరాల తిరుపతి, లకుడం సదానందం, జయరాం, చేరాల ప్రభాకర్, యం.వెంకటేశం, యం. మహేష్, దత్తు, ధ్యావనపెల్లి పరమేశ్వర్, ఉషకోయల మనోహర్, గుండెల్లి రవీందర్, కనుకుంట్ల మధు, గడ్డం సత్యం, ఎలాగొండ ఆంజనేయులు, బండారి శ్రీనివాస్, బూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా పేద విద్యార్థినుల డిగ్రీ విద్యకు "ప్రదీప్తి ఫౌండేషన్" చేయూత
Next 29వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ గడప గడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
ADVERTISEMENT