| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మల్లారపు పురుషోత్తం సేవలు మరువలేనివి : TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

మల్లారపు పురుషోత్తం సేవలు మరువలేనివి : TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మల్లారపు పురుషోత్తం ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగినది. 

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా TSUTF అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ... 

ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేసి అందరి మన్ననలు పొందారు.అనేక సామాజిక సేవా కార్య్రమాల్లోనూ పాల్గొన్నారు,వారి ఆధ్వర్యంలో కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల చాలా అభివృద్ధి చెందింది అని అన్నారు.

30 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాలు చేరేలా సలహాలు, సూచనలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగును నింపారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఆనుగుణంగా నిరంతర విద్యార్థిగా ఉంటూ బోధన లో నూతన ఒరవడిని సృష్టించారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి జి మహేందర్ రావు, ఉపాధ్యక్షులు ఎ రమేష్,కోశాధికారి పి రవీందర్,జిల్లా కార్యదర్శులు  ఎ శివకుమార్, ఎ రవి  లు పాల్గొన్నారు.

Previous కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో?
Next అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు
ADVERTISEMENT