కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ..
డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిధిలోని ఉమిత్యాల,ఉమిత్యాల తాండ మరియు రంగాపురం గ్రామాలలో బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాలపై తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా అభయహస్తం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఎన్నికల ప్రచారం గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అధ్వర్యంలో నిర్వహించారు... గ్రామాలలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు... అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేద ప్రజలకు అండగా పరిపాలన చేసిందని... బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ధనవంతులైన ధనవంతులను మరింత ధనవంతులను చేస్తుందని, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందజేసి,ఓట్లు వేసిన పేదలకు అన్యాయం చేశారన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2లక్షల రుణా మాఫీ,ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డు, విద్యా వికాసం, ఆరోగ్య శ్రీ,రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో నిరుపేద కుటుంబాలకు అందించే విధంగా పని చేస్తుందన్నారు...కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి పంపాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు నావంతు కృషి ఉంటుందన్నారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, నందిన్నె ఎంపిటీసి గీత,శ్రీనివాస్ గౌడ్,సింగిల్ విండో డైరెక్టర్ సూరి,తిమ్మరెడ్డి,మహానంది రెడ్డి,ఆనంద్ గౌడ్, వీరన్న,తిమ్మప్ప, సంతోష్, రాము నాయక్,కృష్ణ, నరసింహ,పద్మరెడ్డి, గోవింద్ రెడ్డి,ఆంజనేయులు, రామన్ గౌడ్,పూడూర్ ఈశ్వర్, బోయ శ్రీను, ఇమ్మానేయిల్, గుంతబాయి శ్రీను, జనార్థన్,డబ్బా రాములు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..